గాంధీతాత:-కే.అశ్విత-9వ తరగతి,ఈ/యం,-జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

దేశం అందరికీ తాత
భారతదేశానికి నేత
ఎవరో ఎవరో చెప్పండి
అతడే మన గాంధీ తాత

కరమ్ చంద్ తండ్రికి
పుత్లీ బాయి తల్లికి
ముద్దుల  బిడ్డడు
గుజరాత్ లో పుట్టాడు

బారిష్టర్ చదవడానికి
ఇంగ్లాండ్ కి వెళ్ళాడు
పోరు లెన్నో చేసినాడు
తీరు లన్ని మార్చి నాడు

ఆంగ్లేయుల పాలనను
అంతము చేయుటకు
నాయకుడై నిలిచినాడు
తరిమి తరిమి కొట్టి నాడు

బాపూజీ గా నిలిచినాడు
త్యాగాలు ఎన్నో చేసినాడు
మిమ్ముమరువలేము ఏనాడు
మళ్లీ రావా గాంధీ తాత.

కామెంట్‌లు