గాలిమేడలు ;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
రెప్పపాటు ప్రయాణంలో
రేయింబవల్ల పోరాటంలో
ఆకాశాన్ని తాకాలనే
ఆశానిరాశల వూగిసలాటలో
రంగులద్దుకుంటున్న ప్రపంచముతో
యుద్దానికి సిద్దమవుతూ
ఉవ్విళ్ళూరుతోన్న మనసు 
గాలిమేడలు నిర్మించుకుంటోంది
నిద్రెరుగని రాత్రులకు కాపలా కాస్తూ

వెన్నెల స్నానంచేసిన మల్లెపందిరిలా నువ్వుంటే
వెలుతురును మింగేసే అమాస చీకటిలా కాచుకు కూచుంటూ
వింత వింత శబ్దాలు చేస్తూ
కొత్త జంతువు

లు సంచరిస్తున్నాయి
విషాన్ని రాసుకున్న కుబుసాన్ని మనసులకు తొడుక్కుని 

చిల్లులు పడిన గాలిబుడగలా నడుస్తూ
ఆటుపోటుల జీవితంలో ఎంతకాలం నువ్వు ప్రయాణిస్తావు
జారుడు మెట్లెక్కుతూ నువ్వు గమ్యాన్ని ఎప్పటికీ చేరలేవు
ఊహల సౌధాలను వదిలి వాస్తవంలోకి వచ్చి చూడు
నిన్నావహించిన ఆశ నిన్నెక్కడ నిలబెట్టిందో తెలుస్తుంది... 
లొంగిపోకు తొంగి చూస్తున్న నీలోని అత్యాశకు.. 

కామెంట్‌లు