శోధన-పరిశోధన:-యలమర్తి అనూరాధహైదరాబాద్ చరవాణి:924726౦206

 మదిని తొలుస్తున్న అనుభూతి 
వెలుగురేఖను చీల్చుకొని 
చీకటి ఆక్రమించినట్లు
రైలు కూత ఆక్రందనలా 
ఏమిటీ భావన?
ఎందుకలా? 
రహస్య సందేశమేమో అని తలపు
ఏమిటది?
శోధన..శోధన..శోధన
ఏదైనా అపాయానికి సూచన 
ఇలా ఆలోచిస్తున్నానో లేదో 
గుంపులు గుంపులుగా చేరి 
కుక్కలు అరుపులు
విచారానికి సంకేతం
అసలు విషయం ఏమిటి? 
ఇంకా నేను పరిశోధనలోనే!
--------------------------------
యలమర్తి అనూరాధ 
బి బ్లాక్ -205
ఎస్ .వి .కె ప్రాజెక్ట్స్
నియర్ చంద్ర గార్డెన్స్ 
గాయత్రీ నగర్
హైదరాబాద్ -18
చరవాణి:9247260206
eమెయిల్:anuradha.yalamarthy@gmail
కామెంట్‌లు