సమస్యాపూరణలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 *ననుమన్నించుము జానకీరమణి నా నాధుండు దుర్మార్గుడే.......*
మ.
కననోడై విని పేలినట్టి పలుకుల్ కళ్యాణి మన్నింపుమా
చననేరన్ తగునేధరిత్రి వన వాంఛన్ వీడి పాలింపుమా
దినమందున్ జన యల్పులన్ గనిన నుద్వేగంబు జూపింతురే
*ననుమన్నించుము జానకీరమణి నా నాధుండు దుర్మార్గుడే*
(వనవాసం వెళ్లే సీతమ్మతో చాకలమ్మ పలుకుల సందర్భం)

సమస్యా పూరణ
*వమ్ము శుభంబుగూర్చు కవివర్యులకెల్ల ననంత సృష్టిలో*
ఉ.
సమ్మతి కోరిరాయలను సత్కవి పెద్దన కావ్యమల్లి యా
నమ్మని సృష్టి వింతలను నాట్యమయూరిగ కళ్లకద్దెనే
కమ్మని కావ్య కైయితను గాత్రము కింపుగ సొంపుగూర్చ భా
*వమ్ము శుభంబుగూర్చుకవి వర్యులకెల్ల ననంతసృష్టిలో*
కామెంట్‌లు