సమస్యాపూరణం;-మమత ఐలకరీంనగర్9247593432
 కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్
ఉ.
భారమునీదెయంచు శివపాదముదిక్కనినమ్మినారమే
దూరముజేయబోకుమయ దుర్జనతత్వముమార్చుమాయనిన్
బేరములాడలేక శివవృత్తములో మునిగేడివారి  కోం
*కారముతీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్*

సమస్యాపూరణ
*దున్నను గట్టి తెమ్మనియె దుగ్దము క్షీరము తీసి యివ్వగన్*
ఉ.
సన్నని త్రాటి కాగకను సాంతము ద్రావుదు నంచువచ్చెనే
మిన్నగ పాలుత్రాగినను మీకును మాకును నుండవే మరిన్
తిన్నగ జెప్పచుండె విన తీరిక జేయక శుద్ధిభాండమున్  
*దున్నను కట్టి తెమ్మనియె దుగ్ధము క్షీరము తీసి యివ్వగన్*

కామెంట్‌లు