లోకరీతి:--మమత ఐలహైదరాబాద్9247593432

 క
ఒంటరి బ్రతుకును నేర్పిన
జంటను సహియించ బోరు జగడంబేలన్
యింటనె నుండుట నేర్పిన
తంటాలకు చిక్కుబడరు తకమిక లేలన్
క.
మనిషిని బంధించి నపుడు
మనసన్నది విరుగుననుచు మరవడ మేలన్
వినయము విలువైనదిమరి
కనగల మనసుకు తెలియును ఘనముగ మనసా!
క.
తనదాక వచ్చినపుడే
ఘనముగ తలపోటెరుగును; గడబిడ జేయన్
వినసొంపుగ నుండదు మరి
కనుమా చెంచలముగాక కంగా‌రేలన్
క.
విధిగా సాధించ దలచి
చదువుల జోక్యంబు నెంచ సంస్కారంబే
చెదిరే మాటలు పలికిన
బుధులెట్లనుటౌనువీరి బుద్ధికి మనసా!

కామెంట్‌లు