నిత్యతాపసి గొల్చి నిర్మలపు హృదయమై
శీతలమ్మగు గిరుల శివనామ స్మరణయై
గౌరిజేసెను పూజ గౌరవమ్ము పొందగ
సర్వదేవతలు గని సాధనకు దీవించ
సానువులలోగలవి సకలవిధ పుష్పములు
సేకరించియు దెచ్చి సేవలన్ జేయగా
నానా విధమ్ములగు నవగీతి స్తోత్రములు
హరునిపై మమతతో హాయిగను పాడుచును
హిమవoతు భాగ్యమున హిమజ రూపిణి శక్తి
లాలిత్య భావనలు లక్ష్యమును గైకొనగ
ఓమ్ నమఃశివాయ యని ఓంకార జపమాల
మాత హస్తము నందు మరిమరియు మెరయుచును
ధవళసుందరమైన ధన్య పరిసర మందు
ప్రమథగణములు వింత ప్రశ్నలను వేయగా
పరమ శివునిని గొల్చి పతిగాను పొందినది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి