సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com
 
జన్మ
@సంసారంలో భగవంతుడి కోసం సాధన చేసే నిమిత్తం నీకు మానవ జన్మ లభించింది.
@ఏ భూమిలో, ఏ సమాజంలో  జన్మ లభించిందో, ఆ భూమి పట్ల, ఆ సమాజం పట్ల ప్రకటించే ఆత్మీయత భావనే దేశభక్తి . డాక్టర్జీ
@కష్టతరమైన మానవజన్మ ఎత్తి ఈ జన్మలోనే  భగవంతుని పొందటానికి కృషిచేయని జీవితం వృధా.
@జన్మ కులం కన్నా గుణమే విలువైనది.   కులాన్ని త్యాగం చెయ్యాలి.   గుణాన్ని గ్రహించాలి. 
@మనిషి ఈ ప్రపంచాన్ని ప్రేమించగలిగినంత వరకే, ఈ ప్రపంచంలో అతని జన్మ సార్ధకం అవుతుంది. రవీంద్రనాథ్ టాగోర్
@మానవ జన్మ ఎత్తడం మహా అదృష్టం.  దాన్ని భగవంతునికే అర్పించు.
@మానవ జన్మ ఎత్తినందుకు ధర్మమార్గాన్ని అనుసరించండి. 
@స్వతంత్రం ప్రతి వారికి జన్మతో వచ్చిన అధికారం. తిలక్
@స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరతాను. తిలక్

కామెంట్‌లు