సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com

 ప్రపంచం-1
@ప్రపంచం ఆలోనాపరులకు సుఖదాయకం, అనుభూతి పరులకు దుఃఖదాయకం. 
@ప్రపంచం ప్రతి మనిషి అవసరాలని తీర్చగలదు కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు. గాంధీజీ
@ఎందుకు జన్మించామో తెలుసుకోకుండా చాలామంది ఈ ప్రపంచం నుండి వెళ్లిపోతుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణ
@ఒక చిన్న గులాబీపూవే నా ఉద్యానవనం కావచ్చు, ఒక్క మిత్రుడే నా ప్రపంచం.  లియో బస్కాగ్లియా
@ఒక వ్యక్తికి తెలిసింది ఏమిటో ప్రపంచం పట్టించుకోదు, ఆ వ్యక్తి  సాధించిన దానినే ప్రపంచం చూస్తుంది.
@కంటికి కన్ను అని హింసకు ప్రతిహింస చేసుకుంటూ పోతే యావత్ ప్రపంచం అంధకారంలో మునిగిపోతుంది.
@కళ ప్రపంచం మొత్తానికి అర్థం అయ్యే భాష. టాల్ స్టాయ్
@చాలామంది ప్రపంచం పైన ఉంటారు, ప్రపంచంలో ఉండరు.  జాన్ మ్యూర్
@జ్యోతిష్యం,మంత్రాలు,ఇంద్రజాలంతో భారతదేశం/ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావు.ఆ భావన ఓటమికి చిహ్నం.
@దారంలో మణులవలె నాయందీ సమస్త ప్రపంచం కూర్చబడినది. శ్రీకృష్ణుడు. గీత
@దేవుని ఆశీస్సుల మేరకు ప్రపంచం మారుతుంది. హాస్కిన్స్
@దేశం చక్కగా ఉంటే ప్రపంచం శాంతియుతమై తులతూగుతుంది.
నిశ్చల, నిర్మల నీటిలో వస్తువులు, నీడలు స్పష్టంగా కనపడతాయి. ప్రశాంత మనోస్ధితిలోనే  ప్రపంచం స్పష్టంగా గోచరం అవుతుంది.
@నీ ఆలోచనల ఫలితమే ఈ ప్రపంచం అంతా.
@నూతన విజ్ఞానం నిండిన ప్రపంచం కావాలనుకుంటే సరికొత్త ప్రశ్నల ప్రపంచం కావాలి.   సుసనీ కె.  లాంగర్
@పుస్తకాలు నీకు స్నేహపూర్వక సలహాలను యిస్తాయి. నువ్వు నిన్ను, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయం, మేధ, మనిషి, ప్రపంచం పట్ల ప్రేమను నింపివేస్తాయి. గోర్కి
@ ప్రతి వాళ్ళు తమ పని తాము చేసుకుంటే ఈ ప్రపంచం ఇంతకన్నా వేగంగా ముందుకెళుతుంది . లూయిస్ కారల్
@ ప్రధానంగా నా ఆసక్తి ఈ ప్రపంచంలోనే, ఈ జీవితంలోనే, మరొక ప్రపంచం, మరొక జీవితం ప్రసక్తి నాకు లేదు.
@ ప్రపంచం ఒక ప్రదర్శన వంటిది.  దీనిలోనికి భిన్న భిన్న వస్తువులు వచ్చిపోతూ ఉంటాయి.

కామెంట్‌లు