దీపావళి ముత్యాల ఆహారాలు;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
దీపావళి దీపావళి
దివ్యమైన దీపావళి
వస్తున్నది వస్తున్నది
ముస్తాబై వస్తున్నది!

ఘనమైన దీపావళి
అమోఘ రూపావళి
వస్తున్నది మస్తున్నది
ముదమును కల్గిస్తున్నది !

వెలుగు జిలుగు దీపావళి
తళుకు బెళుకు దీపావళి
వస్తాదై  ఇక వస్తున్నది
ముస్తాబై తా మస్తున్నది !

దీపావళి దీపావళి
మెరిసి విరిసే దీపావళి
మురిపాల దీపావళి
ముద్దులొలుకు దీపావళి !

దీపావళి దీపావళి
ప్రమిదల దీపావళి
హిందువుల దీపావళి
విందుల మన దీపావళి !

ఘనమైన దీపావళి
పావన మన దీపావళి
వస్తున్నది వస్తున్నది
మస్తున్నది మస్తున్నది !

ఔటులను కాల్చవద్దు
ఔటు మీరు కావద్దు
కాలుష్యం పెంచొద్దు
అవశ్యం తొలగిస్తే ముద్దు !

టపాసులు

కాల్చవద్దు
పటాటోపం చూపవద్దు
దీపాల వెలిగే ముద్దు
పాపాలు తొలగుట కద్దు !

నరకాసుర వధ వల్ల
వచ్చె దీపావళి మల్ల
ఆయె తిమిరావళి గుల్ల
మురిసే ముల్లోకములెల్ల !

కామెంట్‌లు