మా బుజ్జి పాపాయి;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెం.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ఓ బుజ్జి బుజ్జి పాపాయి
మా బుల్లి బుల్లి పాపాయి
గిల్లికజ్జాలు అసలు వద్దోయి
మళ్లీ బజ్జుంటేనే ముద్దోయి 

ఓ అందమైన మా పాపాయి
మా చందమామవు నీవోయి
నే జోల పాడుతాగ ఈరేయి
నీ గోల ఇంక నీవు వీడవోయి !

చిరుచిరు నీలేత లేతబుగ్గలు
చిగురించిన గులాబీ మొగ్గలు
అరవిరిసిన నీ చల్లని నవ్వులు
విరబూసిన మామల్లెల పువ్వులు !

నీకు జోల పాడుతా నేనీరేయి
నీ గోల వీడి ఇక నీవు రావోయి
నీ మారమును ఇక మానవోయి
మా మహారాజువు నీవేగదనోయి !

అమ్మ ఉగ్గు పాలను తాపిస్తుంది
కమ్మని తాయిలం తినిపిస్తుంది
అల్లరి చిల్లరి పనులను చేయొద్దు
అమ్మకు ముద్దులు ఇస్తేనే ముద్దు  !


కామెంట్‌లు