👌కాత్యాయనివి నీవె!
కామ దాయిని వీవె!
నవదుర్గా రూపిణి!
శ్రీమాతా శివాని!
( శ్రీమాత పదాలు.,)
👌శ్రీ మాత.. కామితార్ధ ప్రదాయిని! సింహమును వాహనముగా కల్గినది, ఆరాధకులకు.. ఆమోఘ ఫలదాయిని!
🙏కాత్యాయనీ దేవి.. త్రిమూర్తులైన, బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వరుల... దివ్య తేజస్సుతో.. "కాత్యాయన మహర్షికి పుత్రిక" గా, అవతరించింది.
⚜️కాత్యాయను డొక మహర్షి. ముక్తి మార్గము లెన్ని కలవని, విచారించువాడే కత్యయనుడు. ఆ మహర్షి గోత్రము నందు పరాశక్తి పుట్టినది. కనుక, "కాత్యాయని" యైనది
🔱"షష్ఠం కాత్యాయ నీతిచ" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో ఆరవది .. "కాత్యాయనీ దుర్గ"!
ఓం శ్రీ దుర్గ! జయ దుర్గ! జయ జయ దుర్గ!
( శ్రీ దుర్గా దేవి నామ మాలిక.,)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి