కార్య సిద్ధి నొసంగు!"శంకర ప్రియ.," శీ ల., ;సంచార వాణి: 99127 67098
 👌మహా పురుషుల యొక్క
     సత్సంకల్ప బలము
     కార్య సిద్ధి నొసంగు!
           ఆత్మ బంధువు లార!
      ( ఆత్మ బంధు పదాలు.,)
👌"కార్య సిద్ధి" అనగా.. తాను తలపెట్టిన, జనహిత మైన.. కార్యములను సాధించుట! అది.. మహాత్ముల యొక్క దృఢమైన సంకల్ప బలము మీద ఆధార పడి యుంటుంది. కానీ, ఆయా సాధముల ప్రభావము వలన కాదు; అని, "మన ఆర్ష విజ్ఞానము" విశదీకరించు చున్నది.
👌"క్రియా సిద్ధి: సత్వే భవతి, మహతాం నోపకరణే!" అనే, ఆర్యోక్తికి.. శ్రీరాముని గాధ, ఒక దృష్టాంతము!
🔱దాశరధి యగు రాముడు, జయించ వలసింది.. శ్రీలంకను. కాలి నడకతో దాట వలసింది సముద్రమును. శత్రువా.. దశ కంఠుడైన రావణుడు. యుద్ధ రంగములో సహాయము చేసే వాళ్ళు.. వానరులు. అయినా, రాముడు ఒంటరిగా, అజేయు లైన రాక్షసు లందరినీ జయించాడు. 
 👌"మహా పురుషులకు.. కార్య సిద్ధి; వారి మహత్వ పూర్వమైన, శుభ సంకల్ప ప్రభావము వలననే కలుగుతుంది. అంతే కాని, ఆయా ఉపకరణముల వలన కాదు." ఇది, యథార్థ మైన నగ్న సత్యం!
          🚩నీతి పద్య రత్నం
          ( తేట గీతి )
       కాలి నడకనె దాటంగ బోలు.. కడలి,
       కావరంబు మీరెడు వైరి.. రావణుoడు,
       రణ సహాయులు.. రుక్ష మర్కటము లౌర!
       అయిన, రాము డొక్కడె చంపు.. యాతు జాతి,
       సత్వమున్న జాలు, నికేల సాధనములు?
        ( యాతు జాతి.. అనగా రాక్షస జాతి )
 ( సూక్తి సుధ:  విద్యా ప్రవీణ - భాషా ప్రవీణ, శ్రీ వేదుల సుందర రామ శాస్త్రి.,)

కామెంట్‌లు