మళ్లీ రావయ్య:-చాపలమహేందర్--9949864152

చెడును వినకు
చెడు మాట్లాడకు
హింస చేయకు
మద్యం ముట్టకు

నువ్వు కన్న కలలు
నేడు నిత్యనూతనమై
మూడు పువ్వులు
 ఆరుకాయలుగా
వెలిగిపోతున్నాయి

చెడును వినని రోజు లేదు
చెడు మాట్లాడని దినము లేదు
భూభాగంలో రవ్వంత అయిన
హింస లేదు

అర్ధరాత్రి స్వాతంత్ర్యం
నేడు మిట్టమధ్యాహ్నంమే
హరించిపోతున్నాయి
మద్యం ఏరులై పారుతున్నాయి

మత్తులో మదమెక్కి మృగాళ్లు
పసిమొగ్గలను పండు ముసలి
తేడాలను మరిచి
వావి వరసలను వదిలేసి
ప్రాణాలను చిదిమేస్తున్నారు

ఈ ఘోరాలను ఆపే శక్తి
 మాకు చాలట్లేదు
మళ్ళీ రావయ్యా బాపూజీకామెంట్‌లు