దత్తపదు--మమత ఐలకరీంనగర్
 పిలుపు తలుపు మలుపు గెలుపు
చ.
పిలుపును గాంచలేరుగని పేరుకు వచ్చిన మేమనందురే
తలుపుకు కన్నుబెట్టిఘనకార్యములన్నిటి నడ్డుకుందురే
మలుపును దిప్పి హెచ్చుగ సు మంగళ కార్యములాప నెంచుచున్
గెలుపును మెచ్చబోమనుచు కిందకు లాగిన దైవముండడే

దత్తపది:-పిలుపు తలుపు మలుపు గెలుపు
చ.
పిలుపున కందువాడు జన పెన్నిధి యీశుని గొల్వ మేలగున్
తలుపులు మూసి వేడినను దారిని జూపెడి లోచనిచ్చునే
మలుపుకు మార్గమిచ్చి మరి మాన్యల చెంతకు జేర్చుచుండగన్
గెలుపునకడ్డు గోడలిక క్రీడకు వచ్చును నాటబంతులై

కామెంట్‌లు