అక్షర మాల - బాల గేయం (మ గుణింతం );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 మరమనిషిని రోబో అంటారు 
మామిడిపండ్లు వేసవి రుచులు 
మిరియాల రసం  మంచిది 
మీగడపెరుగు పల్లెలో నాడు 
ముత్యాలు సముద్రంలో ఉంటాయి 
మూర్ఖులతో చెలిమి వద్దు 
మృగరాజు సింహం గంభీరం 
మెట్లెక్కడం మంచి వ్యాయామం 
మేకలు గొర్రెలు రైతుకు సాయం 
మైనపువత్తులు కుటీరపరిశ్రమ 
మొక్కజొన్న గారెలు కరకర 
మోసగాళ్ళను శిక్షించాలి 
మౌనం కూడా శక్తినిస్తుంది 
మంచివాళ్ళకు గుర్తింపు ఉంది!!

కామెంట్‌లు