శమీ పూజ..;-తాటికోల పద్మావతి గుంటూరు.

 పదవ రోజు విజయదశమి. పరాశక్తి దుష్ట శక్తులపై విజయం సాధించినందుకు గుర్తుగా ఆరోజు సాయంకాలం అమ్మవారిని పూజించి, విజయోత్సవం చేయడం, పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. జమ్మి చెట్టును పూజించడం జరుగుతాయి.
శెమి అంటే జమ్మి దోషాలనుశెమింపచేసేది. దీనికి శివ అనే నామం కూడా ఉంది. అర్థం దోషాలనుశెమింపచేసి సుభ స్వరూపమైనది. అని ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రవణా నక్షత్రం కలిసే రోజు. విజయదశమి. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షం పైననే ఉంచారు. అందువల్లనే తర్వాతి యుద్ధాల్లో విజయలు అయ్యారు. అప్పటి నుంచి విజయం కోరుకునేవాళ్లు విజయదశమి రోజు శెమీ వృక్షాన్ని పూజించి, ఆ చెట్టు ఆకులు తాకే సంప్రదాయం వచ్చింది. ప్రతి దినము జమ్మి వృక్షానికి ప్రదక్షిణం చేస్తే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సీతమ్మ తగ్గి ఉష్ణ శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే విష క్రిములు నశిస్తాయి. విజయదశమి రోజున జమ్మి పూజ చేసిన ఆకులను బంధువులకు స్నేహితులకు పంచుకొని కొంత భద్రంగా దాచుకుంటారు ఇదే విజయదశమి నాటి ప్రాముఖ్యత.
కామెంట్‌లు