*ఉమా కాత్యాయనీ ;--యం.వి. ఉమాదేవి - నెల్లూరు
ప్రక్రియ: *ఇష్టపదులు 

*1
ఉమా కాత్యాయనీ ఉత్తమ హృదయమిమ్ము
గౌరీ కాళిందీ గౌరవము కలిగించు 

హైమవతి యీశ్వరీ హైందవీ కరుణించు 
శివా భవానీ యిక శీఘ్రమే కాపాడు 

రుద్రాణి శార్వాణి రుగ్మతల్ తొలగించు 
సర్వ మంగళపర్ణ సర్వార్ధ సాధనీ 

పార్వతీ  దుర్గమ్మ పరమేశ్వరీ మాత
చండికా యంబికా చంద్ర సూర్య ప్రభా 

శైలజా మాతంగి శైవ గిరిజా దేవి 
మేనకాత్మజా మము మేల్కొలుపు విజయినీ!!

కాళిక మహలక్ష్మి కన్యకా శారదా 
బాల త్రిపుర సుందరి భాగినీ యోగినీ 

ఇందిరా కమలినీ ఇరుకళల రూపిణీ 
గాయత్రి త్రినేత్రీ గంగా భవానివే 

అన్నపూర్ణా దేవి అతిలోక సుందరీ 
శ్రీ చక్ర వాసినీం శ్రీలలిత శరణoటి !!

కామెంట్‌లు