"సహస్ర రత్న ముత్యాల హార" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం


 పెద్దకడబూరు మండలంలోని, హిస్సారమురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త గద్వాల సోమన్నను 'సహస్ర రత్న ముత్యాల హార' పురస్కారం వరించింది.బాలసాహిత్యంలో  పలు పుస్తకాలు వ్రాసి,ముద్రించడమే కాకుండా,బాలలచే రచనలు చేయిస్తూ, 'పసి(డి) హృదయాలు ' బాలసాహిత్య వేదికను ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు.ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఖాతాలో మరొక అవార్డు జమ కావడం విశేషం.శ్రీ రాథోడ్ శ్రావణ్ గారు రూపొందించిన ముత్యాల హారాలు నూతన తెలుగు లఘు వచన కవితాప్రక్రియలో సహస్రాధిక మినీ గేయకవితలు అనతి కాలంలో వ్రాసినందుకుగాను,వీరి విశిష్ట సేవలకు గుర్తింపుగా  ఉట్నూర్  సాహితీ వేదిక,ఆదిలాబాద్,తెలంగాణ రాష్ట్రం వారు "సహస్ర రత్న ముత్యాల హార" పురస్కారము-2021ను సోమన్నకు  వాట్సప్ వేదికగా అందజేశారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను ఉట్నూర్ సాహితీ వేదిక,ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ జాదవ్ బంకట్ లాల్,ప్రధాన కార్యదర్శి శ్రీ ముంజుం జ్ఞానేశ్వర్, ప్రచారకార్యదర్శి  శ్రీ ఆత్రం మోతిలాల్, ముత్యాల హారాలు రూపకర్త .శ్రీ రాథోడ్ శ్రావణ్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు