రవి సుప్రభాతం (ఇష్టపదులు);-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
సహ్యాద్రి కొండల్ల సరస భానూదయం 
అరుణ కిరణాలతో ఆహ్లాద పరిసరం 

మేఘాల తరకల్ల మేటి సుప్రభాతము  
రాగాల పులుగులకు రమ్యమౌ పయనమ్ము 

దేశాల నగరాల తేడాలు లేకుండు 
ఉదయాలు వెలిగించ హృదయాల తేజము 

శ్రామికుల తొలిసంజె శ్రమల సౌందర్యమూ 
నావికుల చుక్కాని నదిలోకి పయనం 

వైణికుల గాయకులు వైవిధ్య సాధనలు 
తెలవారు జామునను తెలిమంచు బిందువులు 

భూపాల రాగమది భువనైక మోహనము 
 చేవ్రాలు చేయునది చెక్కిలిన అధరమ్ము 

అరవిరియు కమలమ్ము అరె పాప వదనమ్ము 
గిరగిరా కవ్వమది గిరిధారి గానమ్ము 

ధవళ శోభిత వెన్న ధన్యము గోపకన్య 
రవి సుప్రభాతమిది కవి సమయ భావమిది !! 


కామెంట్‌లు