గుడిసె మీద పారింది
గుమ్మడి కాయ కాసింది
కోతి పిల్ల చూసింది
కాయ తీగను కొరికింది
గుమ్మడి కాడ తెగింది
అవ్వ తాత చూశారు
గబగబావాళ్లు వచ్చారు
గొంగలి వల పట్టారు
గుమ్మడి పండు జారింది
గొంగళి నడుమల రాలింది
తాతా ముక్కలు కోశాడు
అవ్వ ఎసులలో వేసింది
పొయ్యి మీద పెట్టింది
పాయసం మాకు పెట్టింది
కమ్మగ మేము తిన్నాము
ఒంటినిండ బలముతో
ఇంటిలో పనులు చేసాము
అవ్వ జోలపాట పాడింది
హాయిగా నిద్ర పోయాము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి