మత్త కోకిల పద్యాలు
దివ్యమైనది రామపాదము దీనులన్ కరుణించగా
సవ్య రీతిని పౌరులందరు సాగుచున్ యలరించగా
భవ్యధర్మము మాటతప్పని భావనల్ మహినిండునే
నవ్యకాంతుల శీలమొప్పుచు నారిసీతయె సాధ్వియున్!
లోకరీతిని చాటిచెప్పుచు లోకమే శుభ వీక్షణమ్
ఏకమయ్యిరి కైక మంథర లేగతిన్ మరి కుట్రతో
పోకతప్పదు కానకిప్పుడు పొల్లుకాకను మాటయే
శోకమందెనయోధ్య పౌరుల శోభలే కళ హీనమై!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి