అక్షర మాల - బాల గేయం (ర గుణింతం );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 రహదారి భద్రత పాటించాలి 
రాముడు మంచి బాలుడు 
రిక్షా వాళ్ళకిపుడు కష్టం 
రీళ్లుగా సినిమా తీసేవారు 
రుబ్బడంతో చేతులకు  వ్యాయామం 
రూపం కంటే గుణం చూడాలి 
రెల్లు పూలు అందమైనవి 
రేయి పగలు గ్రహచలనం వల్లే 
రైలు ఒక ప్రయాణసాధనo 
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు 
రోజా పూలు అందమైనవి 
రౌతుని బట్టి గుర్రం అంటారు 
రంగులు చల్లేపండుగ హోళీ!!

కామెంట్‌లు