గోట్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు;- వెంకట్ - మొలక ప్రతినిధి
 వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం
ప్రపంచ శాంతి కోసం ప్రతి దేశం కృషి చేయాలి రామకృష్ణ సేవా సమితి: అధ్యక్షులు సూర్యప్రకాశ్

యుఎన్ఓ 
ఐక్యరాజ్యసమితి 24 అక్టోబర్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ప్రపంచ శాంతిని కోరుతూ ఆకాశంలో తెల్లని బెలూన్లు ఎగరవేసి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో
ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ
విద్యార్థులు
సం పూర్ణదేశభక్తిని అలవరచుకుని
ప్రపంచానికి ఉపయోగపడే మానవ వనరులు గాతయారు కావాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ శాంతి పరిరక్షణ అంతర్జాతీయ సహకారం అం ప్రపంచ దేశాల మధ్య సమన్వయం వివిధ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని దానికి ప్రతి దేశం కృషి చేయాలన్నారు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాశ్
ఈ కార్యక్రమంలో sbi ఛానల్ మేనేజర్ kvs కుమార్ పాల్గొని మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ హీరోషిమా నాగసాకి ప్రాంతాలు అను బాంబులు వేసినప్పటికీ క్రమశిక్షణ దేశభక్తితో జపాన్ దేశం అభివృద్ధి చెందిందని ఆదిత్య ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలు అభివృద్ధి మార్గంలో నడవడం కోసం మరింత కృషి చేయాలన్నారు
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్  రోటరీ క్లబ్ సికింద్రాబాద్ వెస్ట్ఆర్ సి సి కో ఆర్డినేటర్ వెంకట్ పాల్గొని మాట్లాడుతూ
ఐక్యరాజ్యసమితి చాప్టర్ విద్యార్థులకు ఎంతగానో పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అని ఈ చాప్టర్ పైన మక్కువ పెంచుకోవాలని గత పది సంవత్సరాల నుండి ఐక్యరాజ్య సమితి పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు
ఈ కార్యక్రమంలోUNO వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు గెలుపొందిన విద్యార్థులకు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సూర్య ప్రకాష్ కె వి ఎస్ కుమార్.వెంకట్ చేతులమీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాఘవేందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు


కామెంట్‌లు