నలిమెల భాస్కర్ సారు (మాత్రాచ్ఛందస్సుమమాల-)- రామ్మోహన్ రావు తుమ్మూరి
తెలంగాణా మట్టి ధగ ధగ  
తెలుగు భాషా యోషకొక నగ 
సబ్బిమండల సాహితీ సిగ  
ఛాత్ర గణముల పాలి  ఆపగ  

ఇరుగుపొరుగుల భాషలన్నీ 
ఇంటిగుమ్మపు తోరణాలుగ
వెలుగుదారుల వెతుకులాటకు  
బతుకు ముడుపును కట్టు మేలుగ

పదునుదేలిన కలం ములికిని 
అదనుగని పని లోన దింపెడు
పసిడి ఊహల ప్రాజ్ఞుడీతడు 
పసిమనసు గల  ప్రవరుడీతడు 

నలిమెలాన్వయ భాగ్య భారవి  
పదియు నాలుగు భాషలకు ఛవి 
హృదయశీతల గగన జాహ్నవి
వెలయ నారాయణపురపు కవి

కామెంట్‌లు