దత్తపది-సాహితీసింధు సరళ గున్నాల
పప్పు చారు పెరుగు కూర

పప్పుననింతనేయినిడి పట్టినకంచము వీడకుండగన్
చప్పునచారుబోసినల జర్రునజారగ పొట్టలోనికిన్
గొప్పగజెప్పనేమిగని కొంచెముపచ్చడిభోజనమ్ముతో
కప్పెడు మీగడల్పెరుగు కమ్మటి కూరను జేర్చవిందుయే

పప్పులేనికూడు పంచామృతమునున్న
చారులేకదినుట చౌకయగును కూరకారమున్న కూర్మితోభుజియింప
పెరుగునింతవేయ ప్రేమపెరుగు

అన్నంబున్దినపప్పునున్నరుచియే పంచామృతమ్మైనటుల్
నెన్నోవంటలుదిన్న,చారుదినకన్ యింపారలేదెప్పుడున్
సన్నన్నమ్ముకుతోడుగూడ పెరుగే శాంతించునాత్ముండుతి
వెన్నన్బెట్టుట కన్నమిన్న కనగా వేడన్నమున్కూరయున్

కామెంట్‌లు