*నానబియ్యం బతుకమ్మ* (నాలుగవ రోజు):-*శ్రీలతరమేశ్ గోస్కుల**హుజురాబాద్.*

పలకరించ వచ్చిన బతుకమ్మను జూసి
పులకరించేను వేవేల మనసులు...

పచ్చని వాకిళ్ళ నిండా పరుసుకున్న ముగ్గులన్నీ ప్రతి మదిని కదిలిస్తుంటే..
పల్లెల్లోనా..
పట్నంలోనా..
కొమ్మారెమ్మన మొలిచిన మొగ్గలు పూత పువ్వై పూయగా..
తంగేడు మెరుపులు గునుగు వన్నెలన్నీ పసిడి వెండి వెలుగుల వెన్నెలా హోయలొలుకుతుంటే..
నాలుగంతరాలుగా పేర్చి..
శిఖరాన గౌరమ్మనుంచెను కోమలాంగులంతా చెంత చేరి...

అమ్మలక్కలంతా
గుంపుగా జేరి
బతుకునిచ్చేటి తల్లిని భక్తీతో కొలిచి
గౌరమ్మ ఉయ్యాలో...
బతుకమ్మ ఉయ్యాలో...
ఉయ్యాలో... ఉయ్యాలా...అని 
ఆటపాటలతో సంబరాల్లో తేలుతుంటే..
ఆనంద పారవశ్యానా
మట్టిబిడ్డ..
బతుకమ్మను చూసి
మురిసిపోతూ కష్టమంతా మరిచేను...

పడుతులందరు
నానబియ్యం బెల్లంతో
చేసిన ముద్దలను 
నైవేద్యంగా పెట్టి.. అమ్మలక్కలందరూ 
వాయనాలందుకొనీ
ఆరగించెదరు ఆనందంగా..

కామెంట్‌లు