అనుమతి ...!!(మాటలు..ఆన్షి,రాతలు..కెఎల్వీ)

 చలువ కళ్లద్దాలు 
చక్కగాఉంటాయట ,
అందంగా ముఖానికి 
అమరిపోతాయట ..
ఎండలో వెళ్లినా ....
టి.వి.చూసినా ....
ఆన్ లైన్ క్లాసుల్లో 
ట్యాబ్ వంక చూసినా 
కళ్ళను 
కాపాడతాయట ....
అందుకె అమ్మనుండి 
నాకు ఈ బహుమతి !
తాతకు కవితరాయమని 
ఇచ్చేసాను అనుమతి..!!
కామెంట్‌లు