గాంధీజీ ఒక్కనాడు :- సత్యవాణి-- కాకినాడ
గాంధీజీ ఒక్కనాడు
గది యంతయు గాలించెను

చిక్క లేదు అతని కంత
చిన్నదైన తన వస్తువు

వెతికి వెదికి వేసారెను
వింత దోచెనతనికెంతొ

ఇక్కడ వుంచిన వస్తువు
యింతలోన యేమాయెన

అనుకొనుచు అయడు యెంతొ
ఆదుర్దా పడసాగెను

అడిగిరి బాపుని యంత
అతని శిష్యులతగూడి

ఏమి పోయె బాపుాజీ
ఎందులకా వెదుకులాట

అని యడగగ అనుయాయులు
అంతట గాంధీ తెలిపెను

చిన్నదైన నాపెన్సిల్ 
చిక్కకుంది నా కంటికి

అని చెప్పెను గాంధితాత
అందరు యక్కజ పడిరి

చిన్నదైన పెన్సిల్ కై
చింతించగ పనియేల

డజనుల పెన్సిల్ బాక్సులు
డ్రాయరు బల్లపై వున్నవి

తీసుకోండి దర్జాగా
దినమునకొక పెన్సిలుగా

పారవేసినాము దాన్ని
బహు చిన్నది ఆయెనని

అని చెప్పిరి  వారందరు
ఆనందింతురు యనుకొని

చిన్నదైన నా పెన్సిల్ 
చేరవలెను నన్నిప్పుడె


పారవేసిన వారెవ్వరొ 
పట్టుకు రండిప్పుడునే

అని చెప్పుచు గాంధీజీ
అలవి గాని పట్టు బట్టె

వెదికిరందరు గుంపులుగా
కనిపెట్టిరి మొత్తానికి

చిన్నదైన పెన్సిలంత
చేరినాది తాతచెంత

వెలిగి పోయె తాత మోము
వైఢూర్యము దొరికినట్లు

అందరితో చెప్పె నిట్లు
అంతట ఆ గాంధీజీ

వస్తువు యేదైనప్పటికీ
విలువ యింత తరుగు బోదు

కడదాకా ఆవస్తువు
కావాలని వాడవలెను

చెత్త యపుడు పెరగబోదు
చివర వరకు వాడినచో

స్వఛ్ఛభారత మౌనప్పుడు
సంఘటితముగ ఆచరింప

స్వఛ్ఛ భారత సూత్రమిదని
చక్కగాను తెలిపె బాపు

          

కామెంట్‌లు