ప్రసాదము ;-పెందోట వెంకటేశ్వరచారి
పూజలు చేసిన ప్రతివారు
దాన గుణంతో ఉంటారు
నైవేద్యాలను పెడుతారు
ప్రసాదాలుగా తలచెదరు

కొబ్బరి కాయలు కొడుతారు
పండ్లను ఎన్నో పెడుతారు
దైవార్పణం అంటారు
భక్తిగ పలువురికి పెడుతారు


దేవుని కృపలను కోరెదరు
తోచినంతనే చేసెదరు
భక్తిని ముక్తిని కోరెదరు
ప్రసాదాలనే పంచెదరు.
కామెంట్‌లు