కవిత;- సత్యవాణి
 ఎర్రని వెలుగు రేఖలు వెదజల్లుతూండగా
బాలభానుడు
కళా వేదికపైకి వస్తున్నాడు
చీకటి తెర పైకెత్త బడింది 
పక్షులు కిలకిలారావాలతో
బాలనటుడికి స్వాగతం పలికాయి
 కళావేదికపై అడుగు పెట్టాడు భానుడు
సరిగ్గా ఆసమయంలోనే
భూ వేదికపై జీవులు నర్తనం మొదలైయ్యింది
రకరకాల జీవులు
రకరకాల రూపాలు
రకరకాలవేషాలు
రకరకాల భావాలు
రకరకాల భాష్యాలు
రకరకాల భావాలు
ఒక ఒకజీవికీ మరొక జీవికీ పోలికేలేదు
ఒక జీవిత నటనకూ మరోజీవి నటనకూ సాపత్యమేలేదు
ఒక భాషకూ ఒక భాషకూ పోలికేలేదు
ఒకజీవి భావానికీ మరొకజీవి భావానికీ
పొంతనే లేదు
బాల భానుని నటనను గమనించిన జీవేలేదు
బాలభనుడు ప్రచండమైన నటనను ప్రదర్శిస్తున్నా
పట్టించుకొన్న జీవుడే లేడు
పొట్టకూటి వేటలోనే
పాట్లు పడుతున్నాయి జీవులు ముసుగులు తొడుగుకొని
ఉదయ్ భానుడు మధ్యహ్న మార్తాడుడై
నటనలో విశ్వ రూపం చూపిస్తున్నాడు
అలాగే అస్తమయసమయంలో 
కెంజాయి కాంతిలో వెలిగిపోతున్నడు ఆదిత్యుడు
వేదిక మీద ఆరోజుకి అభినయంలో చివరి దశకు చేరుకొన్నాడు సూర్యుడు
కళా వేదికపై కాంతులు తగ్గించబడతున్నాయి 
ఆరోజు నటనం చాలించాడు ప్రత్యక్ష నారాయణుడు
కళా వేదిక ఇక ముగింపు పలుకుతూ
చీకటి తెరలను నెమ్మదిగా  నేలకు జార్చింది
నరులు మొఖంపై 
వేసుకొన్న 
రకరకాల ముసుగులు తొలగించుకోవడానికై
హడావిడిగా ఇంటిదారి పడుతున్నారు
ఆరోజుకు తమ నటనను చాలించి
మర్నాటి ఉదయం వరకూ
మరి ఆ ముసుగులతో పనిలేదుమరి వారికి

       

కామెంట్‌లు