*మిట్టపల్లి నానీలు* ; - మిట్టపల్లి పరశురాములు
రాజకీయమొక
గారడి
గద్దెనెక్కినాక
చేస్తారు బురిడి

కరుగనిదే
కొవ్వొత్తి వెలుగదు
చెక్కనిదే రాయి
శిల్పమవదు

బలము ఉన్నదని
మురువకు
గడ్డిపోచలేకమైతె
హస్తిని బంధించు

వదిలివేయుమత్తు
తాగినాకచిత్తు
సంసారమే!
ఓగమ్మత్తు


కామెంట్‌లు