డాక్టర్ చిటికెన కు అరుదైన గౌరవం


 ( ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ) HWPL  ప్రశంసా పత్రం అందుకున్న -డా. చిటికెన 

------------------------------------------------------------------------------------------------------------

 కొరియాకు చెందిన *HWPL ( హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్,  రిస్టోరేషన్ ఆఫ్ లైట్ )* వారి ఆహ్వానం మేరకు   ఈ సంస్థ నిర్వహించే 7 వ వార్షికోత్సవం లో......ప్రతి సంవత్సరం  నిర్వహించే ప్రపంచ  శాంతి సమ్మేళనాన్ని యధాతధంగా ఈ సంవత్సరం అంతర్జాల జూమ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో హెచ్. డబ్యూ. పి. ఎల్ యూత్ విభాగం ఐ. పి. వై. జీ ( ఇంటర్నేషనల్ పీస్ యూత్ గ్రూప్ ) ప్రతినిధి తెలంగాణ సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాసకర్త *-డా. చిటికెన కిరణ్ కుమార్* జామ్ అంతర్జాల సమ్మేళనంలో   పాల్గొని ప్రపంచ శాంతి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.   ఆక్రమణలు. దురాక్రమణలు, ఆధిపత్య భావజాలాలు, ఉగ్రవాదానికి పెను ఊతం ఇస్తున్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఇంకా చాలాదేశాల్లో నీటిమీద రాతల్లా కనబడుతోంది. ఇది మారాలి, ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలి.. యుద్ధంలేని, అణ్వాయుధాలు లేని, క్షిపణి దాడులు లేని, ఆకలి భాధలు లేని ప్రపంచం నిజమైన శాంతికి మార్గం తెరవాలని ప్రజానీకం ఎదురు చూస్తోంది. తన సందేశాన్ని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మ్యాన్ హీలీ   వ్యవహరించగా వివిధ దాదాపు 60 దేశాల నుండి సంస్థ ప్రతినిధులు  తమ తమ ప్రసంగాలు వినిపించారు.అంతర్జాలం ద్వారా శనివారం ప్రశంసా పత్రం  చిటికెన కు అందించారు.

కామెంట్‌లు