భారతకు జాతి పితవు
బోసినవ్వులు నవ్వేవు
ఖద్దరు వంటికి చుట్టేవు
ఆహింసను ఆయుధం చేసేవు
స్వేచ్చా వాయువులందించావు
కులం ,మతం వద్దాన్నావు
కలిసి నడిస్తే ముద్దన్నావు
ఆడది అర్ధరాత్రి స్వేచ్చగా
తిరగాలని కాంక్షించావు
ఆడవారి స్వేచ్చను
చూడకనే కనుమూశావు
నేటి ఆడది నీవు అందించిన
ఆయుధం బూని నడవ జూచిన
ఆమె మాన ప్రాణాలు హరించే
కర్కష మృగాల మధము అణిచే
చేయూత అందించవా..బాపూ
మరలి రా అమ్మతనం రక్షించ
సమాజ కుళ్ళు ను తొలగించ
స్వచ్చతకు స్వేచ్చను ప్రసాదించ
ఇదే నేటి మహిళల ఆకాంక్ష
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి