బాల్యపు చెలికాడు బాలకృష్ణుని వేడ
బాధలు తీర్చును బాగునని యు,
భార్య ,కుచేలుని పంపగా మధురకు
వెంటనే ముదముతో వెన్నుడేగి,
నా లింగనము జేసి నంతఃపురములోకి
గొనిపోయి పాదాలు గోముగా ను,
ప్రక్షాళనము జేసి పారవశ్యము నొంది
ముచ్చటించెను వారు మోదమలర.
ముక్కినటుకుల్ని మూట నందన జూసి,
గుప్పెడన్ని తినెను గుట్టు గాను,
భాగ్యమెంతొ గూర్చి పాటలన్ని తప్పించి,
తెలిపె మనకు నిలన చెలిమి విలువ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి