ఐన్స్టీన్ ని గూర్చి తెలీనివారుండరు.ఒకసారి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉపన్యాసం ఇవ్వాలి అని బైలుదేరాడు.వెంట భార్య కూడా ఉంది. మౌంట్ విల్సన్ లో ఉన్న వేధశాలచూడాలని వెళ్ళాలు.100అంగుళాల వ్యాసంఉన్నపెద్ద దుర్భిణినిచూసి భార్య అడిగింది "ఇంతపెద్దది దేనికి?""ఈ విశ్వం ని కనుక్కోవటానికి."అతని జవాబు విని ఆమె అంది"అరె!ఇవన్నీ నా భర్త పాత చిత్తుకాగితాలపై ఎప్పుడోరాశాడు." "నీభర్త పేరు ఏంటీ?" ఐన్స్టీన్ ప్రశ్నకు తెల్లబోయింది ఆమె!బెర్లిన్లో తన ఇంటి గదిలో న్యూటన్ చిత్రం తో పాటు చిన్న దుర్భిణిని పెట్టుకున్నాడు.తనను ప్రశ్నిస్తే "నేను ఆకాశంలోకి నక్షత్రాలకోసం చూడను.ఈఇంటిలో నాకన్నా ముందు అద్దెకు ఉన్న వ్యక్తి ఈదుర్భిణిని విడిచి వెళ్లాడు.దీన్ని ఒక ఆటవస్తువు బొమ్మలా టేబుల్ పైఉంచుకున్నాను.అంతే!"" మరి మీ లాబ్ వస్తువులను ఎక్కడ: ఉంచుకుని పరిశోధనలు చేస్తారు?" అని ఎవరైనా ఆయనను ప్రశ్నిస్తే "ఇదిగో నాబుర్ర! ఇదే ఒక ప్రయోగశాల!నేను వాడే పరికరం ఈఫౌంటెన్ పెన్!"అని నవ్వుతూ అనేవాడు. ఇంకోరు ఇలాఅడిగారు "మీకు చావంటే భయమా?" ఐన్స్టీన్ జవాబు ఇది" మనిషి ఎలా ఎక్కడ పుడతాడో అతని జీవితం ఎక్కడ ఆరంభం అయి అంతం అవుతోందో తెలీదు. ప్రపంచంలో ఏవస్తువునైనా ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేము."ఎంత వేదాంతం చెప్పాడో కదా?1952లో ఇజ్రాయిల్ తొలి రాష్ట్రపతి చనిపోతే ఐన్స్టీన్ ని చాలా మంది అడిగారు "మీరు ఆపదవిని స్వీకరించండి." ఆయన నిరాకరిస్తూఅన్నాడు "నాకు ప్రకృతిని గూర్చి కొంతైనా జ్ఞానంఉంది.కానీ మనుషుల గూర్చి అవగాహన లేదు. వారి ప్రవర్తన ఆలోచనలు ఎప్పుడు ఎలా మారుతాయో? ప్రభుత్వ యంత్రాంగం ని నిర్వహించే శక్తి సామర్ధ్యాలు నాకు తెలుసు. నాకు వయసు పైపైకి పెరుగుతోంది. ఆలోచనాశక్తి తరిగిపోతోంది.నాకు అంత ఉన్నతపదవితో అవసరం లేదు. "ఒకసారి ఆయన 11ఏళ్ళ కొడుకు పరుగులుపెడుతూ వచ్చి "నాన్న!నీకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి?అందరికీ నీపేరు ఎలా తెలిసింది?" అని అడిగాడు. "అరెబాబూ! ఒక గుడ్డి కీటకం ఫుట్బాల్ ఎక్కే ప్రయత్నంచేయసాగింది.బంతి గుండ్రంగా ఉంటుందని దానికి తెలీదు కదా? కానీ నాకు ఆవిషయం తెలుసు కాబట్టి ఆకీటకం కన్నా నేను గొప్పవాడినని అనిపించుకుంటున్నాను."ఎంత నిగర్వి? ఒక ప్రొఫెసర్ ఆయనను అడిగాడు "మీకు ఏఏవస్తువులు కావాలో లిస్ట్ చెప్పండి. అవి తెప్పించి ఇస్తాను."ఐన్స్టీన్ జవాబు ఇది " నాకు బ్లాక్ బోర్డు చాకపీస్ పేపర్లు పెన్సిళ్లు. ఆ! ఓపెద్ద చెత్త బుట్టకూడా కావాలి. ఎందుకంటే నేను చేసే లెక్కలు తప్పులు పోతుంటాయి.మరి చెత్త కాగితాలు అందులో పడేస్తే ఊడ్చేవారికి సులువు.ముందు పెద్ద చెత్త బుట్ట ఇప్పించండి చాలు!"
శాస్త్రవేత్తలు నిరాడంబరంగా నిష్కల్మషంగా పసిపాప లా ఉంటారు అనిపిస్తుందికదూ?మన అబ్దుల్ కలాం అందుకు మంచి ఉదాహరణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి