బీరకాయతో ఉడుము డా" కందేపి రాణి ప్రసాద్

 పిల్లలూ! మీకు ఉడుము అంటే తెలుసా! పూర్వకాలంలో నున్నగా ఉన్న కోట గోడలు ఎక్కాలంటే ఉడుము సహాయంతో ఎక్కేవాళ్లట.అందుకే ఎవరైనా ఏ విషయం మీదనైన గట్టి పట్టుదలతో ఉంటే 'అబ్బో వాడిది ఉడుం పట్టు'అంటారు ఇది 'రెపటిలియ' విభాగానికి '
"స్క్వా మేటా " క్రమానికి చెందినది. దీని శాస్త్రీయ నామం "వేరానస్ మానిటర్" మరి ఇక ఉడుమును తయారు చేసిద్దామా!
కొంచెం వంపు తిరిగి పొడవైన తోక ఉన్న బీరకాయ ఇది చేయటానికి పనికొస్తుంది.అటువంటి బిరకాయను తీసుకొని ముందువైపు ఒక చీలిక వలె కోయాలి. ఇది నోరు అన్నమాట.కళ్ళ కోసం చిన్న క్యారెట్ ముక్కలు పెట్టి,వాటిపై శనగ గింజల్ని అతికించాలి.కళ్ళ కోసం చిక్కుడు కాయ ముక్కల్ని ఉపయోగించాను.నోరు తెరిచి చూస్తున్నట్లు ఉడుము తయారయింది.ఎలా ఉంది! ట్రై చేయండి
కామెంట్‌లు