తథ్యము సుమతీ. పద్యము.:-తాటికోల పద్మావతి గుంటూరు.

ధన పతి సఖుడై యుండియు,
నెనయంగా శివుడు బిక్ష మెత్తంగ వల సెను,
ధన వారి కెంత కలిగిన
దన భాగ్యమే తనకు గాక తథ్యము సుమతి.

భావము. సుమతి. ధనమునకు అధిపతియగు కుబేరుడు తనకు స్నేహితుడు అయినప్పటికిని, శివుడు బిక్షం ఎత్తవలసి వచ్చినది కదా. అట్లే తనకు సంబంధించిన వారికి ఎంత ధనం ఉన్నానూ తనకు ఉపయోగపడదు. తనకు లభించవలసిన ఫలమే తనకు లభించును. పరుల కున్న ధనం ఎప్పటికీ తనది కాలేదని భావము.
కామెంట్‌లు