దసరా పర్వదినం;---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
విజయ దశమి వేడుక
విజయోత్సవ గీతిక
సంబరాల వేదిక
అనుబంధాల హారిక

సంప్రదాయ సూచిక
సంస్కృతి ప్రబోధిక
మన దసరా పండుగ
సరదాలే !! మెండుగ

జమ్మిచెట్టు ఆకులు
పెద్దలకు కానుకలు
పిన్నలకు దీవెనలు
సంస్కృతికి  చిహ్నాలు

అజ్ఞాతవాసముకు
వీడ్కోలు శుభదినము
విఘ్నములకు సెలవులు
దసరా పర్వదినము


కామెంట్‌లు