అజ్ఞాన తిమిరం బహుదూరం-- లతా శ్రీ-పుంగనూరు
చదువు సంధ్యల సంస్కారం
 జ్ఞాన విజ్ఞానం సంపదల సమాహారం 
భిన్న సంస్కృతుల సమ్మేళనం 
మల్లె మరిమళమై విరిసిన కాలం 
పున్నమి వెలుగులే మన లోగిళ్ళు
 పంచిన "అజ్ఞానతిమిరం"బహుదూరం

అమ్మ నాన్నల ఆప్యాయత 
అన్నదమ్ముల ఆత్మీయత
 భార్య బిడ్డల అనురాగం 
అక్కాచెల్లెళ్ళ అనుబంధం 
బంధుమిత్ర మమతల 
మకరందం మదిని చేరిన
 "అజ్ఞాన తిమిరం" బహుదూరం

మానవత్వమునకు మసిపూయక
 ప్రకృతి కాంత కు హానితలపక 
కుల మత లింగ వర్గ భేదాలు 
ఎంచక సమైక్యతా ఆయుదం
 చేతబూనిన ప్రతిముంగిట 
విరిసిన రంగవల్లుల 
హంగులతో "అజ్ఞాన తిమిరం" బహుదూరం


కామెంట్‌లు