భారతీయ రచయితల ఔన్నత్యం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 బెంగాలీ కథారచయిత సుకుమార్ ఛటర్జీ ఒకసారి హిందీ కవి వీరేంద్రమిశ్రతో వ్యంగ్యం గా "వేదపాఠాలు చెప్పేవారిని వేదీ ద్వివేదీ త్రివేదీ  చతుర్వేదీ అన్నారు. పాఠాలు చెప్పేవారిని ఉపాధ్యాయ్ అన్నారు. సరిగ్గా చదవలేని చెప్పలేని కలగాపులగంగా పనిముగించేవారిని మిశ్రా అన్నారు."అనేప్పటికి ఛటర్జీ  ఎంత బాగా జవాబు ఇచ్చారో చూడండి "మొదట్లో ఇష్టదైవానికి అర్జీలు రాసేవారిని బెనర్జీ అన్నారు. రాయకుండా నోటితో చెప్పేవారిని  ముఖర్జీ అని అదికూడా అనకుండా  అనలేని పదాలను ముక్కలుగా  చాకులా కట్ చేసేవారిని ఛటర్జీ అన్నారు."పాపం!ఛటర్జీగారి మొహం వెలాతెలా పోయింది అని వేరే చెప్పాలా?
ప్రసిద్ధ హిందీ కవయిత్రి మహాదేవీవర్మ మొదట్లో బౌద్దబిక్షువు గా మారాలనుకుంది.శ్రీలంక బౌద్ధవిహారానికి లేఖరాసింది."మీరు భారత్ కి వస్తే నేను కలవాలి అనుకుంటున్నాను.""మేము  భారత్ కివస్తున్నాం.నైనిటాల్ లో బసచేస్తాం.వచ్చి కలవండి "ఆమెకు ఆలేఖ అందగానే తనకున్నదంతా దానధర్మాలు చేసి నైనిటాల్ లో ఆంగ్లవాతావరణం చూసి బిత్తరపోయింది. బౌద్ధగురువు ఆమెని చూస్తూనే మొహం తిప్పి మొహమంతా బట్టతో ముసుగేసుకున్నాడు.సెక్రెటరీ అన్నాడు"ఆయన స్త్రీల మొహం చూడడు."ఫెడీమని ఆమె ఏమన్నదో చూడండి "ఆత్మకి స్త్రీ పురుష భేదంలేదని ఆయనకి తెలీదా?గురుస్థానంలో ఉండి తన మనసుని అదుపులో పెట్టుకోలేని ఆదుర్బలుని దగ్గర నేను సన్యాసం స్వీకరించను.సంసారం లో ఉంటూనే సన్యాసిగా జీవించటంనాకు తెలుసు. "ఆమె కథలుకూడా రాశారు. గొప్ప హిందీ ఛాయావాద కవయిత్రి గా చరిత్ర సృష్టించారు.
సుప్రసిద్ధ హిందీ కవిసూర్యకాంత త్రిపాఠీనిరాలా కి కలకత్తా కి చెందిన ఒక సేఠ్ అందమైన దుస్తులు బహూకరించాడు. నిరాలా వాటిని ధరించి వస్తుండగాతోవలో ఒక బిచ్చగాడు పీలికదుస్తుల్లో చలికి గడగడలాడుతూ కనిపించాడు.నిరాలా వెంటనే తనకోటుని అతనిపై కప్పాడు.ఇది తెలుసుకున్న సేఠ్  ఆయనను ప్రశంసించాడు.ఒకసారి పబ్లిషర్ ఇచ్చిన 300రూపాయలు జేబులో పెట్టుకుని వస్తున్న ఆయనను ఓ బిచ్చకత్తె "బాబూజీ!ఓఅణా ధర్మం చేయి బేటా!ఆకలి!"అంతే ఆ300ఆమె చేతిలో పెట్టారు తనకిఆర్ధిక బాధలున్నా కూడా!సరదాగా  అనేవారు "ధర్మంకోసం  లక్నోలో  కర్మల కోసం  కాశీలో ఉంటాను"ఇదీ మన భారత దేశంలో కవుల రచయితల గొప్పతనం.
కామెంట్‌లు