మూడు కోతులు - బాల గేయం -- షాడోలు ప్రక్రియ --ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

చెడును వినకురా 
చెడు చూడకురా 
 చెడుని అనకురా 
కోతులు చెప్పిన నీతులుమా!

చెడ్డ మాటలను 
అంటు  ఇతరులను 
మనసుకు బాధను 
కలిగించుటెంత పాపముమా!

చెడు పనులు చూసి 
మది గుబులు వేసీ 
లోకమును రోసి 
మన కర్తవ్యం పోవు ఉమా!

చెత్త మాటలను 
ఉత్తగా వినను 
పాపం కూడును 
ఫలితo అనుభవమగును ఉమా!

గాంధీ మార్గం 
సాగుట స్వర్గం 
మంచికి దుర్గం 
బాలలు ఆచరణీయముమా!

కామెంట్‌లు