చామదుంప మనిషి;- డా,కందేపి ప్రసాద్ రావు

 హాల్లో లిటిల్ చిల్డ్రన్! ఈ చామదుంప మనిషిని చూస్తే మికేమనిపిస్తున్నది.కోతి నుంచే మానవుడు ఉద్బవించాడని డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతం చాలా కరెక్ట్ అనిపిస్తోంది. కదూ సరే అతని మొహం ఎలా ఉంటే మనకెందుకు ? మనం వెజిటబుల్ కార్వింగ్ లో భాగంగా ఈ మనిషిని సృష్టిద్దామా!
పై ఫొటోలో ఉన్న చామదుంప తల,శరీరం లా విడివిడిగా కనపడుతున్నప్పటికి ఇది ఒకే చామదుంప.దీనికి కళ్ళ దగ్గర గుంటలు ముక్కులగా బుడిపె, నోరు లాగా సన్నని గీత - అంతా చూడగానే మనిషి మొహంలా కనిపించింది.అందుకే ఎక్కువ కష్టపడకుండానే ఈ మనిషి తయారైపోయాడు.కళ్ళ కోసం గుంటలు ఎలాగూ ఉన్నాయి.కాబట్టి అందులో 
కంది పప్పు గింజలు పెట్టి మధ్యలో నల్లరంగు పూశాను.అవి కళ్ళు ,కనుపాప వలే  కనిపిస్తున్నాయి.
ఇక ముక్కు నోరు అంత నేచురల్ గా ఏర్పడిందే. చేతుల కోసం రెండు పచ్చిమిరపకాయల్ని శరీరాని
కిరువైపులా పిన్ చేశాను.కాళ్ళు కోసం రెండు కరివేపాకు ఆకుల్ని పెట్టాను.ఈ మనిషి బొమ్మ అంతా
నాచురల్ గా తయారైందే. ఎక్కువ అలంకరణ లేమి లేకుండానే  ఈ బొమ్మ తయారయింది.మీరు కూడా కూరగాయల్లో ఆకారాలు గమనించి  వాటినలా తయారుచేయండి బై!
కామెంట్‌లు