మదిచిద్విలాసం..(కలంస్నేహం)-సత్యవతి ఆలపాటి
వేణువై  మోగెనె హృదయం .
చిరునవ్వుల  సవ్వడులే జాజులై పూచె మదిలో..

మోములో దాగని సిగ్గులు
ఊహల సన్నిధిలో కులుకు
నయనం కలువలై విరిసెను

పెదవులు గులాబీ రేకులు 
ఇంద్రధనస్సు వంపు నొసలు
కోటేరు ముక్కుకు ముక్కెర...

తొలకరి వలపుల  జల్లుగా 
మొలకెత్తే తలపుల భావం
చిందించె కులుకుల రాగం..

చిలిపి  ఊసులు మదిచేరి
నిలువనీయ్యని  ఊహలతో
ఉక్కిరిబిక్కిరి  హృదయం.

మధురమై అధరవీధులలో
తేనేలసోనలు సాగెనులే
మధుమయ  ధారలా...

పద్మవ్యూహం కమ్మె మదిలో
మాటల్లేని భావాలు విరిసే మదిలోన..

మాయల్లె  నను ముంచెనే
లేడిపిల్లలా  మానసం 
పరుగులు తీయగ ..

 మునుపెన్నడు లేని ఈ సంబరం 
  నన్నావహించి  వేణువై మోగెనే  
నా మది కొత్త నాదంలా   వీనులు సోకెనె ....

పరువాల మరులు మల్లెలై  
కాచెనే ,పరిమళాలు పరచెనే.
మయూరిలా నాట్యమాడె 
నా డెందమునా ...


కామెంట్‌లు