*ప్రేమ-సాహిత్యం*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 121.ప్రేయసి అందం,
               ఊర్వశి దిగదుడుపే!
        మాట మాధుర్యం,
                   వాణి వెనుకడుగే!
        కనుసైగ కాలానికి ఆజ్ఞ!
    కాలినడక హంసలకవజ్ఞ!
122.ప్రియుని పలకరింపు,
            ఆనందం పులకింత!
        అనన్య పరాక్రమం,
          స్యయంవరాన మెరుపు!
        అద్భుత సాహసం,
              ప్రేమయాత్ర గెలుపు!
        సుందరదరహాసం,
             మధుమాసం పిలుపు!
123.
      కవిత్వం ప్రేమ ప్రతిబింబం!
      పింగళి కలంకేళి రాసకేళి!
      సముద్రాలల రసముద్ర!
      ఆత్రేయ అక్షర సంతకం!
   ఆరుద్ర ప్రాసలు పనసతొనలు!
124.
    భావశ్రీ,భాషశ్రీ వెరసి శ్రీ శ్రీ!
   సినారె గీతాలు వినితీరాలి!
   కృష్ణశాస్త్రి మల్లెల మాలలు!
   మల్లాది నవ్యరాగాల ప్రోది!
  దాశరథి విజయగీత సారథి!
125.వేటూరి దస్తూరి కస్తూరి!
       సుద్దాల పాటలు దిద్దాల!
       భావాల బాస్ చంద్రబోస్!
       కొసరాజు కోరుకునే రాజు!
       రమ్యగీతశ్రీ రాజశ్రీ!
          (కొనసాగింపు)
-

కామెంట్‌లు
రామానుజం. ప చెప్పారు…
ప్రేమంటే ప్రేయసీప్రియుల భావోద్వేగాలే కాదు ,
కవుల రచనల గానగీతాల పరిష్వంగనాలు !! 👏