సాహితీ ముత్యాలహారo పురస్కారం జెడ్.పి.హెచ్.ఎస్. నేరళ్లపల్లి విద్యార్థులకు ప్రదానం.
 మహబూబ్ నగర్ జిల్లా,బాలానగర్ మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్.నేరళ్లపల్లి పాఠశాలలో తొమ్మిదవ  తరగతి చదువుతున్న విద్యార్థులు కాట్రావత్ దివ్య,బి.పావని లకు"ముత్యాలహారo" పురస్కారం వరించింది.
శ్రీ శ్రావణ్ రాథోడ్ రూపొందించిన ముత్యాలహారాలు నూతన తెలుగు లఘు వచన కవితా ప్రక్రియలో శతాధిక మినీ గేయకవితలు అనతి కాలంలోనే వ్రాసినందుకుగాను "ఉట్నూరు సాహితీ వేదిక,ఆదిలాబాద్ "వారు"సాహితీ ముత్యాలహారo"పురస్కారం ను ఈ చిన్నారులకు ఆన్లైన్ ద్వారా అందజేశారు.అవార్డ్ గ్రహీతలు దివ్య,పావని  లను..బాలసాహిత్యంలో రచనలు చేసేలా ప్రోత్సహిస్తున్న శ్రీమతి పి.చైతన్య భారతి లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ. పాండురంగారెడ్డి,ఉపాధ్యాయ బృందం శ్రీనివాసులు,రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి,ఉమాదేవి,శారదాదేవి,త్రివేణి,వసుంధర,నవనీత అభినందించారు.
విద్యార్థులకు అభినందనలు తెలిపిన వారిలో పాఠశాల ఎస్.ఎం.సి. చైర్మన్ శేఖర్,ఆయా గ్రామ సర్పంచులు ఖాళీల్ పాషా,మంజు నాయాక్,గోపీ నాయక్,రవి నాయక్,మండల కో ఆప్షన్ మెంబర్,మాజీ ఎం.పి.టి.సి.లు,తల్లిదండ్రులు ఉన్నారు.


కామెంట్‌లు