డా.దాశరథికృష్ణమాచార్యులుగారి 34 వ వర్థంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
"దండముదాశరథిసుకవి"
"దండముతెలగాణవీరధర్మాత్ముడవే"
"దండముమీపద్యాలకు"
"దండముపోరాటయోధదండమునెపుడున్"!!!

02.
తే.గీ.
"అగ్నిధార"లుకురిపించియవనియందు
దుష్టనైజాముచర్యలద్రుంచివేసి
పీడితజనులచేతాను ప్రేమలంది
దాశరథి"కవిసింహ"మైధన్యతగొనె!!!

03.
తే.గీ.
బొగ్గుతోపద్యములువ్రాసినిగ్గుదేల్చి
కరుడుగట్టిననైజాముకరకుగుండె
చీల్చిమనతెలంగాణముశ్రేష్ఠతలను
విశదపరిచినపోరాటవీరుడితడు!!!

04.
తే.గీ.
"నాతెలంగాణకోటిరత్నాలవీణ"
యనిపలికెదాశరథిగారువినయముగను
విప్లవాగ్నులుకురిపించిభీకరముగ
ఆనిజామునునెదురించపూనుకొనెను!!!

05.
తే.గీ.
చలనచిత్రగీతాలనువిలసితముగ
శ్రోతలకునందజేసియుప్రీతితోడ
నందుభావసంస్కారాలుపొందుపరిచి
డెందమానందమొందించెబంధువతడు!!!కామెంట్‌లు