"సమయానికిపద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
సమయముసమరమెభువిపై
సమయముతోపోటిపడినసత్ఫలితములన్
సమయమెమనకందించియు
సమయముఅవకాశమొసగిసంస్కారమిడున్!!!

02.
కం.
సమయాభావములేదని
సమయముపైనిందలేయసముచితమగునే?
సమయముసంపదలొసగును
సమయములక్ష్యమ్ముజూపుసాధించుమికన్!!!

03.
కం.
సమయమెసంతోషమ్మిడి
సమయమెసద్బుద్ధినిచ్చిసాకునుమనలన్
సమయమువినియోగించిన
సమయముసరియైనదారిసతతముజూపున్!!!

04.
కం.
సమయములేదనికొందరు
సమయమునిదికాదుననుచుచప్పుడులేకన్
సమయమువృథజేసుకొనుచు
సమయముతోవాదులాటసాగింతురయా!!!

కామెంట్‌లు