01.
కం.
"దీపావళిపర్వదినము"
చూపించునుమంచిదారిసుజనులకెపుడున్
పాపాలనుతొలగించియు
నోపికతోవిజయమొసగి,నున్నతిగూర్చున్!!!
02.
తే.గీ.
చీకటులనుతరిమివేసిశీఘ్రముగను
సొబగు"దీపావళీ"కాంతశోభగూర్ప
వసుధకేతెంచిముద్దుగాప్రతిఫలంబు
నందజేయుచుబ్రతుకునవిందుగొలుపు!!!
03.
కం.
నవ్వులురువ్వుచునిలపై
దివ్వెలుకలిగించుకాంతిదేదీప్యముగన్
"పువ్వులపూజలులక్ష్మికి"
సవ్వడితోమోతమ్రోగిసంబరమొప్పున్!!!
04.
కం.
లక్ష్మీదేవినిగొల్చుచు
లక్ష్మీదేవికిసలుపునులక్షలపూజల్
లక్ష్మీ!శ్రీలక్ష్మి!యనగ
లక్ష్మీమాతయెనొసగునులక్షవరములన్!!!
05.
ఉత్సాహము.
దీపకాంతులెల్లజూడదివ్యముగనువెల్గుచున్
పాపములనుపారద్రోలుపర్వమిదిగొవచ్చెలే
కోపతాపములనుద్రుంచికోర్కెలెన్నొతీర్చుచున్
శాపమొసగకుండశుభము,శాంతి"లక్ష్మి"నొసగునే!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి