"దానధర్మము-పద్యాంజలి"!!!;-'సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
దానధర్మమ్ముతోడనుధరణిజనులు
సుఖముపొందుటతథ్యముసులభమౌను
నిత్యకర్మగాజేసిననిలకడగను
దేవదేవుండుమెచ్చియుత్రోవజూపు!!!

02.
తే.గీ.
దానగుణమునుకల్గినదాతలకును
సర్వశుభములుచేకూరుసత్వరముగ
లోకమందునవీరికిలోటులేక
సాగిపోవుజీవితమికచక్కగాను!!!

03.
తే.గీ.
అన్నిదానాలలోకెల్లఅన్నదాన
మేయనియుదెల్పెనానాడుమేటిగాను
నిపుడువిద్యదానమెగొప్పయెవరికైన
నిదియుజేసినసతతంబుముదముగల్గు!!!కామెంట్‌లు